🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 October 2026, 9:08 am Posted by : ARYADVI NEWS

యిలసింగవరం గ్రామంలో వరి పొలాలను పరిశీలించిన ఏఈఓ అన్వేష్

News Image
అనంతగిరి, అక్టోబర్ 3 (ఆర్యాద్వి):అనంతగిరి మండల పరిధిలోని వాయిలసింగవరం గ్రామంలో త్రిపురవరం క్లస్టర్ ఏఈఓ అన్వేష్ వరి పొలాలను పరిశీలించి, రైతులకు తగు సలహాలు సూచనలు అందించారు.వానాకాలం వరి పంటలలో ఉదృతమయ్యే ఆకు నల్లి నివారణకు ఎకరాకు ప్రొఫినొఫాస్ 400 మీ.లీ లేదా స్పిరోమెసిఫెన్ 200 మీ.లీ లేదా ప్రొపెర్గేట్ 400 మీ.లీ చొప్పున పిచికారి చేయాలని మరియు బ్యాక్టీరియా ఎండాకు తెగులు నివారణకు కాఫర్ హైడ్రాక్సెడ్ ఎకరానికి 400 గ్రాములు లేదా ప్లాంటామైసిన్ ఎకరానికి 80 గ్రాములు, సుడి దోమ ఉదృతి కనిపిస్తే వాటి నివారణకు ఎకరానికి ఎసిపేట్ 300 గ్రాములు లేదా బుఫ్రోఫెజిన్ 320 మీ.లీ చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు.
తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే నత్రజని ఎరువులు వేయకుండా పొటాష్ ఎరువులు వేయాలని రైతులకు సూచించారు.ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాసులు, రైతులు కొల్లు సుబ్చారావు ,దేవులపల్లి నరసింహరావు,వీరబోయిన సైదులు,కంటు వెంకటేశ్వర్లు, దాసరి లక్ష్మినర్సు,కంటు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home