🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

ఆదివారం, 04 Oct 2026, 9:11 AM

QR Code

కోదాడ మండల కార్పెంటర్ యూనియన్ నూతన అధ్యక్షుడు ఉపేంద్ర చారి ప్రమాణ స్వీకారం మహోత్సవం

News Image

కోదాడ,అక్టోబర్ 3 (ఆర్యాద్వి):

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక ది కోదాడ మండల కార్పెంటర్ యూనియన్ నూతన అధ్యక్షుడు ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ వెంకటరత్నం కుసుమ బాబు పాల్గొని మాట్లాడుతూ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన ఉపేంద్ర చారి కి అభినందన తెలుపుతూ పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ప్రతి కార్పెంటర్స్ ని కుటుంబం లో సభ్యుని లా కలుపుకొని అన్ని విజయాలు సాధించాలని అన్నాడు అనంతరం నూతన అధ్యక్షుడు ఉపేంద్ర చారితో ప్రమాణ స్వీకారం చేయించారు. యూనియన్ అనే పదమే అందరూ ఒకటే బాట, ఒకటే మాట కష్టకాలంలో కూడా ఒకరికి ఒకరు తోడ్పాటు అనీ సందర్భనుసారంగా వారు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కోదాడ మండల కార్పెంటర్స్ మరియు విశ్వబ్రాహ్మణ సంఘం వివిధ నాయకులు పాల్గొన్నారు

🏠 Home