🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 October 2026, 9:12 am Posted by : ARYADVI NEWS

మున్నూరు కాపు నగర అధ్యక్షుడు గా రాపర్తి శరత్

News Image
నూతన కమిటీకి స్వాగతం:- శెట్టి

ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 3 :ఖమ్మం నగర మున్నూరు కాపు కమిటీ అధ్యక్షులుగా మాజీ కార్పొరేటర్ రాపర్తి శరత్ కుమార్, కార్యదర్శిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగుమతి శాఖ కార్యదర్శి భైరిశెట్టి శ్రీనివాసరావు, కోశాధికారిగా గంగిశెట్టి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.
ఈ ఎంపిక ప్రక్రియ పెద్దలు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శెట్టి రంగారావు జిల్లా ట్రస్టు బోర్డు కార్యదర్శి కనిశెట్టి నర్సయ్య జిల్లా మహిళా అధ్యక్ష కార్యదర్శులు పగడాల మంజుల-తోట సుజలరాణి పెద్దలు తాళ్లూరి హనుమంతరావు , మేకల శ్రీనివాస రావు,పసుపులేటి నాసరయ్య, తాళ్లూరి సోమయ్య , కార్పొరేటర్ లు పాలేపు వెంకట రమణ, చామకూరి వెంకట నారాయణ, గోళ్ళ వెంకట్, మడూరు ప్రసాదు, వెన్న పండు, దేవిశెట్టి వెంకటేశ్వర్లు, సి హెచ్ విప్లవ కుమార్ తదితరుల సమక్షంలో జరిగింది..
నూతన అధ్యక్ష కార్యదర్శి లు మాట్లాడుతూ తమ మీద ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తామని విద్యా, వైద్యం ఇతర అవసరాల్లో పేద మున్నూరు కాపులకు అండగా ఉంటామని తెలిపారు. కీర్తి శేసులు మేకల సంగయ్య, మలిశెట్టి వరదయ్య, కనకం సత్యం, రాపర్తి రంగారావుల ఆదర్శాలు, వారి పోరాటాలను గుర్తు ఉంచుకొని వారి అడుగుజాడల్లో నడుస్తామని తెలిపారు..
🏠 Home