2029 నాటికి 4-స్టార్.. ప్రభుత్వ స్కూళ్లపై మంత్రి లోకేశ్ సమీక్ష!
ఏడాదిలో వన్-స్టార్ నుంచి టూ-స్టార్.. వెయ్యి స్కూళ్లకు 5-స్టార్ లక్ష్యం
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచే దిశగా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఈ అంశంపై మంత్రి నారా లోకేశ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి పలు లక్ష్యాలను నిర్దేశించారు. 2029 నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను కనీసం 4-స్టార్ ప్రమాణాలకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు.
వన్, జీరో-స్టార్ స్కూళ్లపై ప్రత్యేక దృష్టి
ప్రస్తుతం వన్-స్టార్ స్థాయిలో ఉన్న పాఠశాలలను ఏడాదిలోపు టూ-స్టార్ స్థాయికి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. జీరో-స్టార్ పాఠశాలలను ప్రస్తుత విద్యా సంవత్సరంలో కనీసం వన్-స్టార్ స్థాయికి చేర్చేలా చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కనీసం వెయ్యి పాఠశాలలను 5-స్టార్ స్థాయికి అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు.
ఏజెన్సీ ప్రాంతాల స్కూళ్లకు ప్రాధాన్యం
ఏజెన్సీ, వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని లోకేశ్ అధికారులకు సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున 175 లీప్ స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
కంప్యూటర్, అటల్ టింకరింగ్ ల్యాబ్లపై ఫోకస్
పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పురోగతిని నిరంతరం పర్యవేక్షించే బాధ్యతలను డీఈవోలు, ఎంఈవోలు, సీఆర్పీలకు అప్పగించాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని సుమారు 7 వేల హైస్కూళ్లలో పూర్తిస్థాయి కంప్యూటర్ ల్యాబ్లు, అటల్ టింకరింగ్ ల్యాబ్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు.
విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం
విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా వినియోగించుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ ఏడాది 5 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించే లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. యువతను నైపుణ్య పోర్టల్లోకి తీసుకురావడంతో పాటు కృత్రిమ మేధ ఆధారిత ఇంటర్వ్యూలు, విదేశీ భాషల శిక్షణ వంటి కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టాలని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను దశలవారీగా మెరుగుపరుస్తూ.. 2029 నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలలను 4-స్టార్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో విద్యాశాఖ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తోంది.