🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

సోమవారం, 05 Oct 2026, 7:35 PM

QR Code

తెలంగాణ జర్నలిస్టుల జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులు గా గరిడేపల్లి రాము నియామకం

News Image

అనంతగిరి, అక్టోబర్ 05:(ఆర్యాద్వి):

తెలంగాణ జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేజేఏసీ)లో సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులుగా గరిడేపల్లి రాము ని నియమిస్తూ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర అధ్యక్షులు తొగరి కరుణాకర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల గణేష్ ఈ నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బుంగ చాందిని తెలిపారు. నూతనంగా నియమితులైన జిల్లా ఉపాధ్యక్షులుగా తమ హోదాలో తక్షణమే అధికారిక బాధ్యతలు చేపట్టాలని ఆమె కోరారు. జేఏసీ నియమ నిబంధనలను పాటిస్తూ, క్రమశిక్షణతో పనిచేయడంతో పాటు సంస్థ చేపట్టే తదుపరి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన గరిడేపల్లి రాము కి ఈ సందర్భంగా జేఏసీ నాయకులు, సభ్యులు పలువురు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

🏠 Home