🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

సోమవారం, 05 Oct 2026, 7:37 PM

QR Code

ఖానాపురం కుమ్మరి గ్రామ కమిటీ ఎన్నిక

News Image

అనంతగిరి అక్టోబర్ 05 (ఆర్యా ద్వి)

అనంతగిరి మండలం ఖానాపురం గ్రామంలో టీఆర్‌కేఎస్‌ కుమ్మరి గ్రామ కమిటీ ఎన్నికను నిర్వహించారు. కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు చలిగంటి రామారావు అధ్యక్షతన, జిల్లా కో-కన్వీనర్‌ బాడిషా రామారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చలిగంటి రామారావు మాట్లాడుతూ కుమ్మరి సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాలని, కుల సభ్యుల సమస్యల పరిష్కారానికి సంఘం తరఫున కృషి చేస్తామని తెలిపారు. బాడిషా రామారావు మాట్లాడుతూ సంఘ సభ్యులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, అవకాశాలపై అవగాహన కల్పించి అర్హులందరికీ ప్రయోజనం చేకూరేలా కృషి చేస్తామని అన్నారు.

గౌరవ అధ్యక్షుడిగా సిద్ధపల్లి వెంకటేశ్వర్లు, అధ్యక్షుడిగా కొలిచలం వెంకటేశ్వర్లు (చిన్ని), ఉపాధ్యక్షుడిగా కొలిచలం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా సిద్దేపల్లి లక్ష్మయ్య, సహాయ కార్యదర్శిగా గుడిమెట్ల విజయ్‌, కోశాధికారిగా సిద్దేపల్లి బాబు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా పాలబిందెల కనకయ్య, గుడిమెట్ల ఉపేందర్‌, కొలిచలం రాజశేఖర్‌, కొలిచలం బ్రహ్మం ఎన్నికయ్యారు. కార్యక్రమంలో నాయకులు సిలువేరు నరసింహారావు, చలిగంటి మురళి, కొలిచలం శ్రీనివాస్‌, కొలిచలం నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

🏠 Home