🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 October 2026, 8:02 pm Posted by : ARYADVI NEWS

ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి

News Image
- ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే డా.రామచంద్రు నాయక్ పిలుపు

- గిరిజన సంఘం రాష్ట్ర నాయకులతో కలిసి పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఖమ్మం ప్రతినిధి : అక్టోబర్, 5:


సోమవారం,బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మ నాయక్ ఆర్ శ్రీరాం నాయక్, భూక్యా వీరభద్రం, ఎం బాలు నాయక్,వాంక్డోత్ వీరన్న,అశోక్ లతో కలిసి డా.రామచంద్రు నాయక్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 4 వ మహాసభలు అక్టోబర్ 10,11 తేదీల్లో హైదరాబాద్ లో జరుగుతున్న సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఠానూ నాయక్ పేరుతో నంగారా ఉత్సవాలను హైదరాబాద్ లోని పలక్ నామా ప్రాంతంలోని రవీందర్ నాయక్ నగర్ లో పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తెలిపారు. అక్టోబర్ 10 వ తేదీన ఉదయం.11.30 గంటలకు రవీందర్ నాయక్ నగర్ లోని లింబ్రా హోటల్ నుండి కళా ప్రదర్శ ప్రారంభం అవుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన కళాకారులు ఆటపాటలతో ఉత్సవాలు రోజంతా జరుగుతాయని అన్నారు.గిరిజనుల సంస్కృతిని చాటి చెప్పే విధంగా జరుగుతున్న ఈ ఉత్సవాలలో తెలంగాణ వ్యాపితంగా గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో విరోచితంగా పోరాడి అమరుడైన గిరిజన యోధుడు ఠానూ నాయక్ పేరుమీద జరగడం చాలా సంతోషకరమని అన్నారు. మారుతున్న గిరిజనుల జీవన విధానం వలనా గిరిజనుల సంస్కృతి,సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
🏠 Home