🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

బుధవారం, 07 Oct 2026, 8:21 PM

QR Code

రాహుల్, ప్రియాంక అరెస్ట్.. బలవంతంగా వాహనం ఎక్కించిన పోలీసులు

News Image

న్యూఢిల్లీ: జంతర్ మంతర్‌ వద్ద నిరసనకు వెళ్తున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఇండియా కూటమి ఎంపీలు చేపట్టిన నిరసనలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రోడ్డుపై బైఠాయించిన నేతలు

జంతర్ మంతర్‌ వైపు వెళ్తున్న ప్రతిపక్ష ఎంపీల బస్సులను పోలీసులు అడ్డుకోవడంతో నేతలు రోడ్డుపై బైఠాయించారు. ప్రియాంక గాంధీ ఇతర మహిళా నేతలతో కలిసి రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు.

బలవంతంగా వాహనాల్లోకి

నిరసన కొనసాగుతుండగా పోలీసులు రాహుల్ గాంధీని భుజాలపై మోసుకెళ్లి పోలీసు బస్సులో ఎక్కించారు. అనంతరం మహిళా పోలీసులు ప్రియాంక గాంధీతో పాటు ఇతర మహిళా నేతలను అక్కడి నుంచి తరలించి వాహనాల్లోకి ఎక్కించారు. పలువురు ప్రతిపక్ష ఎంపీలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఓటర్ల జాబితాల సవరణపై ఆరోపణలు చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల కమిషన్‌, బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నాయి.

🏠 Home