🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

బుధవారం, 07 Oct 2026, 8:27 PM

QR Code

ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన బజాజ్ ఫైనాన్స్

News Image

ముంబై: ఫిక్స్డ్ డిపాజిట్‌ (FD) ఖాతాదారులకు బజాజ్ ఫైనాన్స్ గుడ్‌న్యూస్ చెప్పింది. వివిధ కాలపరిమితుల FDలపై వడ్డీ రేట్లను 15 నుంచి 40 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. సవరించిన రేట్లు అక్టోబర్ 7, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త డిపాజిట్లతో పాటు రెన్యూవల్ చేసే FDలకు కూడా ఇవి వర్తిస్తాయి.

గరిష్ఠంగా 7.75 శాతం

సాధారణ ఖాతాదారులకు 12–17 నెలల FDపై వడ్డీని 6.60 శాతం నుంచి 6.80 శాతానికి పెంచారు. 18–30 నెలలకు 6.85 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది. 31–60 నెలల కాలానికి గతంలో 7.40 శాతంగా ఉండగా ఇప్పుడు 7.75 శాతానికి చేరింది.

సీనియర్ సిటిజన్లకు 8.15 శాతం

సీనియర్ సిటిజన్లకు సాధారణ రేట్లపై అదనంగా 0.40 శాతం వడ్డీ లభిస్తుంది. దీంతో 31–60 నెలల FDపై గరిష్ఠంగా 8.15 శాతం వడ్డీ పొందొచ్చు. మెచ్యూర్ అయిన FDని రెన్యూవల్ చేసుకునే వారికి అదనంగా 0.10 శాతం వడ్డీ ప్రయోజనం ఉంది.

ఈ రేట్ల పెంపు తాజాగా ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి తీసుకెళ్లిన నేపథ్యంలో వెలువడింది.

🏠 Home