🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 08 October 2026, 9:39 am Posted by : ARYADVI NEWS

అందాల పోటీలో విజేతగా నిలిచిన ఖమ్మం యువతి కోపూరి అలేఖ్య..

News Image
ఖమ్మం ప్రతినిధి : అక్టోబర్ 7:
ఖమ్మం : ఢిల్లీలోని ద్వారక , సెక్టార్ 21లో ఉన్న వివాంటా హోటల్లో డికె పేజెంట్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ప్రైడ్ ఆఫ్ ఇండియా 2026 గ్రాండ్ ఫినాలే లో ఖమ్మం మమతా రోడ్డు ప్రాంతానికి చెందిన కోపూరి అలేఖ్య పాల్గొని ప్రైడ్ మిసెస్ తెలంగాణ 2026 (జి - 2) కేటగిరిలో విజేతగా నిలిచి ప్రత్యేక గుర్తింపు పొందారు . ఈ కార్యక్రమంలో మిస్టర్ , మిస్ , మిస్ టీన్ మరియు మిసెస్ విభాగాల నుండి పోటీదారులు ఒకచోట చేరి , తమ ప్రతిభ , ఆత్మవిశ్వాసం మరియు వ్యక్తిత్వాన్ని ప్రదర్శించారు . డికె పేజెంట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు జిమ్మీ గరిమా నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది . సోనాల్ గోసాలియా జ్యూరీ ప్యానెల్లో సభ్యురాలిగా ఉండగా అమన్ యతన్ వర్మ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు . ఖమ్మం జిల్లాకు చెందిన యువతి కోపూరి అలేఖ్య ప్రతిష్టాత్మకమైన అందాల పోటీలో విజేతగా నిలిచి ఖమ్మం జిల్లాకు గర్వకారణంగా నిలిచారు . తన ప్రతిభ , ఆత్మవిశ్వాసం , ఆకట్టుకునే ప్రదర్శనతో పోటీలో అందరి దృష్టిని ఆకర్షించిన అలేఖ్య.. పోటీ వివిధ దశల్లోనూ ప్రతిభ కనబరిచి విజేత టైటిల్‌ను కైవసం చేసుకున్నారు . అందాల పోటీలో కేవలం అందం మాత్రమే కాకుండా వ్యక్తిత్వం , ఆత్మవిశ్వాసం , ప్రతిభ , వేదికపై ప్రదర్శించే నైపుణ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు . ఈ అంశాల్లో తనదైన ప్రతిభను చాటుకున్న కోపూరి అలేఖ్య విజేతగా నిలిచి ప్రత్యేక గుర్తింపు పొందారు . ఖమ్మం జిల్లా నుంచి అందాల పోటీలో పాల్గొని విజేతగా నిలవడం పట్ల కుటుంబ సభ్యులు , స్నేహితులు , శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు . అలేఖ్య సాధించిన ఈ విజయం ఖమ్మం జిల్లాకు గర్వకారణమని , యువతలో ప్రతిభకు కొదవ లేదని పలువురు అభినందనలు తెలిపారు . ఈ సందర్భంగా కోపూరి అలేఖ్యకు పలువురు అభినందనలు తెలియజేస్తూ , భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఖమ్మం జిల్లాకు , తెలంగాణ రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు .
🏠 Home