🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

శుక్రవారం, 09 Oct 2026, 9:27 AM

QR Code

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్వోత్తమరెడ్డి విజయం ఖాయం

News Image

కాంగ్రెస్ అభ్యర్థి విజయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధీమా

ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 8 :

నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గానికి జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన రామిరెడ్డి సర్వోత్తమరెడ్డి గురువారం సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా సర్వోత్తమరెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్వోత్తమరెడ్డి ఘన విజయం సాధిస్తారన్న ధీమాను మంత్రి వ్యక్తం చేశారు.

ప్రజా సమస్యలపై అవగాహన, పార్టీ పట్ల నిబద్ధత, పట్టభద్రులు–ఉద్యోగ వర్గాలతో ఉన్న అనుబంధం సర్వోత్తమరెడ్డికి కలిసొస్తాయని మంత్రి పేర్కొన్నారు. పట్టభద్రుల ఆశయాలను శాసనమండలిలో బలంగా వినిపించే అవకాశం సర్వోత్తమరెడ్డికి కల్పించాలని మంత్రి ఆకాంక్షించారు.

ప్రస్తుతం ఏఐసీసీ, టీపీసీసీ సభ్యుడిగా కొనసాగుతున్న సర్వోత్తమరెడ్డి, పార్టీ శ్రేణులు, పట్టభద్రులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని మంత్రి సూచించారు.

నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

🏠 Home