🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

శుక్రవారం, 09 Oct 2026, 7:19 PM

QR Code

సివిల్ సప్లెస్ జిల్లా మేనేజర్ ఆస్తులపై ఏసీబీ దాడులు..

News Image

ఖమ్మం: మహబూబాబాద్/ అక్టోబర్ 9:

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే అనుమానంతో సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ వాసంశెట్టి నరసింహారావుకు సంబంధించిన నివాసాలు, బంధువుల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టినట్లు సమాచారం.

ఆదాయానికి మించిన ఆస్తులు

కలిగి ఉన్నారనే అనుమానంతో సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ వాసంశెట్టి నరసింహారావుకు సంబంధించిన నివాసాలు, బంధువుల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టినట్లు సమాచారం. గతంలో ఖమ్మం జిల్లాలో సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్గా పనిచేసిన నరసింహారావు ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆస్తులు, ఆదాయ వనరులపై ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.

ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఆరు నుంచి ఏడు ప్రాంతాల్లోఏకకాలంలో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఖమ్మం నగరంలోని కవిరాజు నగర్ ఉన్న మోహన్ అనే బంధువు నివాసంతో పాటు నేలకొండపల్లి మండలంలోని పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లా, హైదరాబాదులో ఎల్బీనగర్ ప్రాంతం, ప్రస్తుతం నరసింహారావు విధులు నిర్వహిస్తున్న మహబూబాబాద్ జిల్లాలోనూ ఆయనకు సంబంధించిన ఆస్తులు, నివాసాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

గతంలో ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహించిన సమయంలో నరసింహారావు సస్పెన్షన్కు గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన గత ఉద్యోగ నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వివరాల పై ఏసీబీ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. సుమారు 15 సంవత్సరాల ఉద్యోగ కాలంలో ఆయన పొందిన జీతభత్యాలతో పోలిస్తే కూడబెట్టిన ఆస్తుల విలువ అధికంగా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై అధికారులు ఆస్తుల పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, ఇతర ఆర్థిక రికార్డులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న సోదాలతోపాటు ఇతర జిల్లాల్లో జరుగుతున్న తనిఖీల్లో ఎలాంటి ఆస్తులు గుర్తించారు, వాటి విలువ ఎంత, ఏవైనా కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారా అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏసీబీ అధికారుల నుంచి పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సోదాలఅనంతరం ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

🏠 Home