మొండితోగు జి పి వెంచర్ భూములను కొంటే గోడకేసిన సున్నమే తిరిగి రాదు. - ఇల్లందు ఎమ్మార్వో ఖాసీం.
ఇల్లందు ప్రతినిధి: అక్టోబర్, 5:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఇల్లందు మండలంలోని మొండితోగు గ్రామపంచాయతీ లోని సర్వేనెంబర్ 588/12/1/2, 588/12/1/3 భూములు కొంటే తిరుపతి హుండీలో వేసినట్లేనని, గోడకేసిన సున్నమేనని తిరిగి రావని ఇల్లెందు ఎమ్మార్వో ఖాసీం అన్నారు. ఇటీవల మొండితోగు గ్రామపంచాయతీ లోని 1/70 పరిధిలోని 9 ఎకరాల లొ ఎలాంటి లేఅవుట్, అనుమతులు లేకుండా కొందరు వెంచర్ వేసి ప్లాట్లు చేసి అమ్మ కానికి పెడుతున్నట్టు వస్తున్న వార్తల విషయమై ఇల్లందు ఎమ్మార్వో కాసిం ను" మీడియా ప్రతినిధి ఈ విషయమై వివరణ కోరగా మండలంలోని మొండితోగు గ్రామపంచాయతీ లోని తొమ్మిది ఎకరాల భూములు వెంచర్ చేసి అమ్మకాలు పెట్టిన విషయాన్ని ఆ గ్రామ పంచాయతీ సెక్రెటరీని ఇల్లందు ఎంపీడీవోను కలసి విషయం తెలుసుకోవాలన్నారు. మొండితోగులోని సర్వే నెంబర్ 588/12/1/2, 588/12/1/3 లోని 9 ఎకరాలు 1942 లోనే కాస్తు లో ఉన్నాయని, పట్టాలు ఉన్నాయని పట్టాలు కలిగిన వారు తమ తొమ్మిది ఎకరాలను ప్లాట్లు చేసి అమ్మాలనుకుంటే ముందుగా ఎమ్మార్వో కార్యాలయంలోనూ సంప్రదించి నాలా పన్ను కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, ఆ క్రమంలో ఆ భూములు ప్రభుత్వ భూములా లేక సింగరేణి భూములా, అసైన్డ్ భూములా అని విచారణ చేస్తామని, ప్లాటు చేసి అమ్మకాలు చేసుకునేందుకు 30 పేజీల నిబంధనలు ఉంటాయని ఇవన్నీ పూర్తి చేయకుండా వ్యవసాయ భూములను ప్లాట్లు చేసి అమ్మకానికి పెడితే కొనుగోలుదారుల సొమ్ము బూడిదలో పోసిన పన్నీరెనని ఎమ్మార్వో అన్నారు. అనుమతులు లేని భూములను, స్థలాలను కొంటే స్థలాలకు రిజిస్ట్రేషన్ ఉండదని ఇంటి నెంబర్లు, నీరు, విద్యుత్, రహదారులు మంజూరు కావని ఆయన తెలిపారు. వెంచర్ దారుల ఆకర్షణనీయమైన ప్రకటనలకు స్థలాలు కొని మోసపోవద్దని ఇల్లందు ఎమ్మార్వో కొనుగోను దారులకు విజ్ఞప్తి చేశారు. మొండితోగు గ్రామపంచాయతీ స్థలాలను కొనుగోలు చేయాలని ఎవరైనా కోరుకుంటే సంబంధిత అధికారులను భూముల స్థలాల విషయమై సంప్రదించి విషయాలు తెలుసుకోవాలని, ప్రాట్లను కొంటే అన్ని వసతులు లభిస్తాయా లేదా అనే విషయాలు, స్థలానికి హక్కుదారులు అవుతామా లేదా అనే విషయం తెలుసుకోవాలని ఏ విషయం తెలుసుకోకుండా కొని మోసపోవద్దని ఆయన తెలిపారు.