వైభవోపేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ భూమిపూజ నిర్వహించాలి.....
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ , సహకార చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు
తిరుమల తరహాలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
తిరుమల తరహాలో క్యూలైన్లు, బారికేడ్లు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలి
భక్తులకు అన్నప్రసాదం, త్రాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచాలి
అక్టోబర్ 12న అల్లిపురంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా ఆలయ భూమిపూజ
ఆలయ నిర్మాణ ప్రాంగణాన్ని, భూమిపూజ ఏర్పాట్లను పరిశీలించి మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి తుమ్మల
ఖమ్మం ప్రతినిధి : అక్టోబర్, 9:
ఖమ్మం నగరంలోని అల్లిపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణ భూమిపూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. వేలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, సిపి సునీల్ దత్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో కలిసి మంత్రి భూమిపూజ ప్రాంగణాన్ని, ఏర్పాట్లను పరిశీలించి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ సోమవారం అల్లిపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించ నున్నట్లు తెలిపారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుందని పేర్కొన్నారు.
దేవదేవుని ఆశీస్సులతో ఖమ్మం నగరంలో స్వామివారి ఆలయ నిర్మాణం చేపట్టడం సంతోషకరమని తెలిపారు. ఆలయ నిర్మాణం, నిర్వహణ బాధ్యత పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానానిదేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్తో పాటు ఖమ్మం నగరంలోనూ టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు నిర్మిస్తున్నట్లు వివరించారు.
భక్తిభావం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలి:
ఆలయ భూమిపూజ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవోపేతంగా నిర్వహించాలని మంత్రి సూచించారు. పూజా కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లను విస్తృతంగా చేపట్టాలని, ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా చూడాలని ఆదేశించారు.
పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, దేవాదాయ తదితర శాఖల అధికారులు సమన్వయం తో పనిచేయాలని, అవసరమైన కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి శాఖకు నిర్దిష్టబాధ్యతలు అప్పగించాలని తెలిపారు. అధికారులు అంకితభావంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
తిరుమల తరహాలో క్యూలైన్లు, బారికేడ్లు:
తిరుమలలో అనుసరించే విధానాలను ఆదర్శంగా తీసుకుని భక్తుల రాకపోకలకు అనుగుణంగా క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. భూమి పూజ ప్రాంగణం, భోజన కేంద్రాలు, ప్రసాద పంపిణీ కేంద్రాల వద్ద రద్దీ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎక్కడా తొక్కిసలాటకు అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అన్నప్రసాదం, పులిహోర సమృద్ధిగా అందించాలి:
భూమిపూజ కార్యక్రమానికి ఎంతమంది భక్తులు వచ్చినా అందరికీ నాణ్యమైన భోజనం అందించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి తెలిపారు. భూమిపూజ జరిగే ప్రాంతానికి దూరంగా భోజన కేంద్రాలను ఏర్పాటు చేసి, ఎక్కువ సంఖ్యలో ఆహార పంపిణీ కౌంటర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.
ప్రసాద పంపిణీ కేంద్రాలను పెంచాలని, ప్రసాదం కోసం వచ్చే భక్తులకు క్రమబద్ధమైన క్యూలైన్లు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ సంఖ్యలో త్రాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు మజ్జిగ ప్యాకెట్లు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని తెలిపారు.
పార్కింగ్, వైద్య, విద్యుత్ సదుపాయాలు కల్పించాలి:
భక్తులు నాలుగు వైపుల నుంచి వచ్చే మార్గాలకు అనుగుణంగా పార్కింగ్ స్థలాలను గుర్తించాలని మంత్రి సూచించారు. పార్కింగ్ ప్రాంతాలు, వాహనాల రాకపోకల మార్గాలు, భక్తులు ప్రాంగణానికి చేరుకునే దారులకు సంబంధించిన వివరాలను మ్యాప్తో సహా సిద్ధం చేయాలని తెలిపారు. ఈ వివరాలను పోలీస్ శాఖ ద్వారా పాత్రికేయులకు అందించి, భక్తులకు ముందుగానే సమాచారం చేరేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.
పుష్కరాల తరహాలో వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని, వైద్య సిబ్బంది, అవసరమైన వైద్య సదుపాయాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచడంతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయంగా జనరేటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రాంగణంలో నిరంతర పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, అవసరమైన సిబ్బంది, యంత్రాంగాన్ని అందుబాటులో ఉంచాలని తెలిపారు. కార్యక్రమానికి వచ్చే పాత్రికేయులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.
పార్టీలకతీతంగా భక్తులందరూ పాల్గొనాలి:
ఖమ్మం నగరంలో ప్రజల సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని,అవసరమైన ప్రాంతాల్లో ప్రజలను ఒప్పించి రహదారుల విస్తరణ పనులు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఆలయం నిర్మించడం ఈ ప్రాంత ప్రజలకు దేవదేవుడు అందించే గొప్ప ఆశీర్వాదమని పేర్కొన్నారు. తిరుమలలో పాటించే క్రమశిక్షణ, భక్తిభావం, నిర్వహణ విధానాలు ఖమ్మం ఆలయంలోనూ అమలవుతాయని తెలిపారు.
పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ఆలయ భూమి పూజ కార్యక్రమానికి హాజరై దేవదేవుని ఆశీస్సులు పొందాలని మంత్రి కోరారు. కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో విజయవంతం చేసేందుకు భక్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ ఖమ్మం నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మాణం జరగడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఆలయ నిర్మాణంపై ప్రజలు ఎంతో ఆసక్తి, భక్తిశ్రద్ధలు కనబరుస్తున్నారని పేర్కొన్నారు. భూమిపూజకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖల సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేపడతామని, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీటీడీకి జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
పోలీస్ కమీషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ ఖమ్మం నగరంలో పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం సంతోషకరమని తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల భద్రత, సౌకర్యాల కోసం పోలీస్ శాఖ తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు.
వాహనాల పార్కింగ్, భక్తుల రాకపోకలు, భోజన కేంద్రాలు, ప్రసాద పంపిణీ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేపట్టి, ట్రాఫిక్ నియంత్రణతో పాటు కార్యక్రమం సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ భూమిపూజ కార్యక్రమం సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన సిబ్బంది, యంత్రాంగంతో చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, టిటిడి దేవస్థానం, మీడియా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు