ఉపాధీ పనులు కల్పించి ఆదుకోవాలి
ఎంపీడీవో కు వ్యకాస వినతి
కారేపల్లి: అక్టోబర్, 9:
కారేపల్లి : ఉపాధీ పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఎంపీడీవో కు వినతిపత్రం అందజేశారు. ఎలినినో ప్రభావతం గ్రామాలలో రైతులు పంటలు వేయక వ్యవసాయపనులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని వారికి వీబీజీ రాంజీ క్రింద పనులుకల్పించాలని వినతిలో కోరారు. ఈ సందర్బంగా వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాలలో కరువు పరిస్ధితులు కనిపిస్తున్నాయన్నారు. వ్యవసాయ సాగుతో జనవరి వరకు వ్యవసాయ పనులు దొరికే వనినేడు కరువు పరిస్ధితులతో వ్యవసాయ కూలీలు పట్టణాలకు వలస పోతున్నారని అక్కడ కూడా పనులు లేక రోడ్ల వెంట తిరగాల్సిన పరిస్ధితి ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించే ఉపాధి పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఉపాధి పని 200 రోజులు రూ. 700 కూలితో కల్పించాలని కోరారు. ఉపాధీ పనిలో కొలతలు, రెండు పూటల పోటోలుతీయటం వంటి నిబంధనలు ఇబ్బందికరంగా మారాయన్నారు. వీబీజీ రాంజీ బిల్లుతో కూలీలు పని హక్కు కోల్పొతారన్నారు.దానిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలోభాగంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద ప్రతి కూలీకి ఏడాదికి రూ.12వేలు అందించాలని రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసరవస్తువులు పేదలకు అందజేయాలనికోరారు. ఈకార్యక్రమంలో వ్యకాస మండల అధ్యక్షులు కేసగాని ఉపేందర్, నాయకులు చల్లా మల్లమ్మ, శనగ రాంబాబు, జీ.శ్రీను తదితరులు పాల్గొన్నారు.