🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 10 October 2026, 6:57 pm Posted by : ARYADVI NEWS

రేవంత్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేసినా వెనక్కి తగ్గేది లేదు

News Image
తుంగతుర్తి నియోజకవర్గ టీపీసీసీ సోషల్ మీడియా మూడ్ మోహన్ నాయక్

రేవంత్ రెడ్డిని బద్నాం చేయడానికి బీఆర్ఎస్ భజన బృందానికి నాయకత్వం ప్రత్యేక టాస్క్ ఇచ్చిందని తుంగతుర్తి నియోజకవర్గ టీపీసీసీ సోషల్ మీడియా మూడ్ మోహన్ నాయక్ ఆరోపించారు.

రేవంత్ రెడ్డిని తిడితే రూ.100, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే రూ.50, ఫేస్‌బుక్‌లో కామెంట్లు పెడితే రూ.500 చెల్లిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిని ఎంత ఎక్కువగా విమర్శిస్తే అంత ఎక్కువ డబ్బులు వస్తాయనే విధంగా టాస్క్ ఇచ్చారని ఆరోపించారు.

మీరు వేసిన ప్రతి రాయితో రేవంత్ రెడ్డి గోడ కడుతున్నారు అని వ్యాఖ్యానించారు. హరీశ్ రావు, కేటీఆర్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి తగిన సమాధానం చెబుతారని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను తెలంగాణ నుంచి బహిష్కరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీశ్ రావులను రాజకీయంగా ఎదుర్కొన్నప్పుడే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభావం తగ్గుతుందని వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డిపై ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా ఆయన వెనక్కి తగ్గరని మోహన్ నాయక్ అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని కల్వకుంట్ల కుటుంబం పగటి కలలు కంటోందని విమర్శించారు.
🏠 Home