🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

శనివారం, 10 Oct 2026, 6:59 PM

QR Code

వాయిలసింగవరం గ్రామంలో వీబీజీరామ్‌జీ పధకం సామాజిక తనిఖీపై గ్రామసభ

News Image

గ్రామసభకు అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాసులు

అనంతగిరి, అక్టోబర్ 10( ఆర్యాద్వి):

అనంతగిరి మండల పరిధిలోని వాయిలసింగవరం గ్రామంలో ఈరోజున వీబీజీరామ్‌జీ పధకం 2025-2026 ఆర్ధిక సంవత్సరంలో జరిగిన పనులపై మరియు చేయాత పెన్షన్లపైసామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది

ఈసందర్భంగా సామాజిక తనిఖీ డిఆర్పీ ముత్తయ్య తనిఖీ పై నివేదికను చదివి వినిపించారు

మరియు గ్రామంలో ఆర్ధిక అక్షరాస్యత పై గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది

బ్యాంకింగ్ సేవల వినియోగం డిజిటల్ లావాదేవీలు పొదుపు యొక్క ప్రాముఖ్యత భీమా పధకాలు పెన్షన్ పథకాలు రుణాల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సైబర్ మోసాల నుండి రక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు

ప్రతి కుటుంబం ఆర్థిక ప్రణాళికతో ముందుకు సాగాలని ప్రభుత్వ మరియు బ్యాంకులు అందిస్తున్న వివిధ ఆర్ధిక సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇట్టి కార్యక్రమంలో మండల వీబీజీరామ్‌జీ పధకం ఏపీవో నూక బత్తిన వెంకన్న,చింతకుంట్ల సతీష్, గ్రామ పంచాయితీ కార్యదర్శి కాకర్ల సౌమ్య, వార్డు సభ్యులు బొడ్డుపల్లి ప్రవీణ్, మేట్లసంఘం నాయకులు కొల్లు సుబ్బారావు, గడ్డం వీరబాబు, బుర్రా వీరబాబు, చింతా సునిత, మేళ్ళచెర్వు గురవయ్య, గరిడేపల్లి కనకయ్య,కంటు చామంతి, ఆశావర్కర్ మరియమ్మ మరియు కూలీలు గ్రామ పంచాయితీ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

🏠 Home