🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 10 October 2026, 7:16 pm Posted by : ARYADVI NEWS

పోలీసులను ఎంతమందినైనా పిలవండి.. వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్ గాంధీ

News Image
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఎంతమంది పోలీసులను మోహరించినా, నాయకులను అరెస్టు చేసినా తమ ఆందోళన ఆగదని స్పష్టం చేశారు. అక్టోబర్ 10న ఢిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యం

ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తదితరులపై రాహుల్ విమర్శలు చేశారు. వారిలో పిరికితనం ప్రధాన లక్షణమని ఆరోపించారు. దేశ రాజ్యాంగాన్ని కాపాడటం, ప్రజల గొంతును పరిరక్షించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. యువత నిరసనలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల సంఘంపై విపక్షాల నిరసన

ఓటర్ల జాబితా సవరణల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఓటర్ల జాబితాలో అనర్హమైన పేర్లను తొలగించేందుకు ధృవీకరణ చేపట్టామని ఎన్నికల సంఘం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నిరసనలు, పోలీసుల నిర్బంధాలు కొనసాగుతున్నాయి.
🏠 Home