🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

ఆదివారం, 11 Oct 2026, 9:20 AM

QR Code

పొలానికి వెళ్లే దారికి అడ్డంగా చెత్త కుప్పలు వేసిన పట్టించుకోని అధికారులు

News Image

* డంపింగ్ యార్డ్ ఉండగా దారిపై చెత్త వేసిన వైనం

*అనంతగిరి*అక్టోబర్ 10, (ఆర్యాద్వి):

మండల పరిధిలోని వసంతాపురం గ్రామంలో గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం, కక్షపూరిత వైఖరికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకున్న ర్యాంపును గ్రామపంచాయతీ ట్రాక్టర్ ఆ దారిలో నడపగా రాంపు ధ్వంసం అయింది. ఇదేంటని ప్రశ్నించినందుకు గ్రామానికి చెందిన రైతు పొలానికి వెల్లే ఆ దారికి అడ్డంగా చెత్త కుప్పలు వేయించారని ఆరోపణలు వస్తున్నాయి.రైతులు తమ పంటలను తీసుకెళ్లేందుకు, వ్యవసాయ పనులకు వెళ్లేందుకు ఈ దారే ప్రధాన మార్గం కాగా, ఇప్పుడు చెత్త, బురదతో మూసుకుపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదేంటని ప్రశ్నించినందుకే కక్షగట్టి ఉద్దేశపూర్వకంగా తమ పొలం దారిలో చెత్త వేయించారని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ఉండగా చెత్త కుప్పను రోడ్లపై వేయడాన్ని రైతులు ఖండించారు.పచ్చని పొలాల మధ్య ఈ చెత్త కుప్పలు దుర్వాసనతో పాటు రోగాలకు కారణమవుతున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

ఈ విషయంపై గ్రామ సర్పంచ్, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, వెంటనే స్పందించి చెత్తను తొలగించి, రైతుల దారిని పునరుద్ధరించాలని గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.

🏠 Home