🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 11 October 2026, 9:24 am Posted by : ARYADVI NEWS

ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు ఉపశమన సంరక్షణ.. యువతలో మానసిక ఆరోగ్యంపై అవగాహన అవసరం

News Image
- జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి రామారావు.

ఖమ్మం ప్రతినిధి : అక్టోబర్ 10 :

ప్రపంచ హాస్పిస్ మరియు ఉపశమన సంరక్షణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH) (జి జి హెచ్) లోని పాలియేటివ్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామారావు, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అరుణాదేవి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ రామారావు, డి ఎం హెచ్ ఓ., మాట్లాడుతూ, తీవ్రమైన మరియు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు శారీరక నొప్పి నుంచి ఉపశమనం కల్పించడంతో పాటు, మానసిక ధైర్యాన్ని అందించడంలో ఉపశమన సంరక్షణ సేవలు కీలక పాత్ర పోషిస్తాయని ,. రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడం, వారి కుటుంబాలకు అవసరమైన సహకారం అందించడం ఈ సేవల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం ఆయన ఆసుపత్రిలోని రోగులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. కిరణ్ కుమార్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, ఎన్‌సీడీ సెల్ డీఈఓ నాగేంద్రాచారి, ఎన్. సచినారాయణ, పాలియేటివ్ కేర్ సిబ్బంది అశోక్, సుమలత, సుజాత, నాగమణి, విజయ తదితరులు పాల్గొన్నారు., అనంతరం.,

విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన అవసరం

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని న్యూ విజన్ కళాశాలలో నిర్వహించిన మానసిక ఆరోగ్య అవగాహన సదస్సులో డాక్టర్ డి రామారావు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అరుణాదేవి పాల్గొని విద్యార్థులకు మానసిక ఆరోగ్య ప్రాధాన్యతను వివరించారు.

ఈ సందర్భంగా పిఓ డాక్టర్ అరుణాదేవి మాట్లాడుతూ, నేటి యువత, విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ఆందోళన (Anxiety), నిరాశ (Depression) వంటి సమస్యలను గుర్తించి, వాటిని అధిగమించేందుకు సరైన అవగాహన అవసరమని , మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, అవసరమైనప్పుడు నిపుణుల సహాయం తీసుకోవాలని , మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవడం, సానుకూల ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా విద్యార్థులు చదువులోనూ, వ్యక్తిగత జీవితంలోనూ మెరుగైన ఫలితాలు సాధించవచ్చని వివరించారు.

ఈ కార్యక్రమంలో మానసిక వైద్య నిపుణులు డాక్టర్ సోహేల్, ఎన్‌సీడీ సెల్ డీఈఓ నాగేంద్రాచారి, ఎన్. సచినారాయణ, న్యూ విజన్ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home