🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 12 October 2026, 8:26 am Posted by : ARYADVI NEWS

ఎండుతున్న పంటలు.. పట్టించుకోని విద్యుత్‌, సాగునీటి సమస్యలు!

News Image
పగటిపూట నాణ్యమైన కరెంటు ఇవ్వాలి.. 14బీ కాలువకు మరమ్మతులు చేపట్టాలి

ప్రభుత్వానికి పాలారం రైతు తేజావత్ వీరన్న విజ్ఞప్తి...

అనంతగిరి,అక్టోబర్ 11 (ఆర్యాద్వి):
అనంతగిరి మండలంలో పాలారం లో పంటలు కళ్లముందే ఎండిపోతుండటంతో రైతు తేజావత్ వీరన్న ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రిపూట విద్యుత్ సరఫరా వల్ల సాగునీరు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పగటిపూట నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా పంట పొలాలకు సాగునీరు అందించే 14బీ కాలువను అధికారులు పట్టించుకోవడం లేదని, కాలువకు మరమ్మతులు చేపట్టి చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్‌, సాగునీటి సమస్యలతో రైతులు నష్టపోకుండా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పంటలను కాపాడాలని ఆయన కోరారు.
🏠 Home