🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

సోమవారం, 12 Oct 2026, 8:30 AM

QR Code

ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 4 వ మహాసభలు

News Image

ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 11:

హైదరాబాదులో గిరిజన సంఘ రాష్ట్ర మహాసభలు ఎం ధర్మ నాయక్, భూక్యా వీరభద్రం, ఎం బాలు నాయక్,గుగులోత్ భీమా సాహెబ్ ,ఎర్ర నాయక్,అచ్చాలి బాయి అధ్యక్షతన జరిగాయి.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్ కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టి మాట్లాడారు.వేదికపై వాంకుడోత్ వీరన్న, అశోక్ తదితరులు ఉన్నారు.

-కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలపై పోరాడాలి తీర్మానాన్ని ఆమోదించారు.

-కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ గిరిజనులకు ఇచ్చిన హామీలను తక్షణం అమలుకు కార్యాచరణ ప్రకటించాలని లేకపోతే రాష్ట్ర వ్యాపిత ఐక్య ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు.

- పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, మైదాన ప్రాంత గిరిజనులకు ఐదు ఐ టి డి ఏ లను ఏర్పాటు చేయాలని, మూడు గిరిజన కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1500 కోట్లను కేటాయించాలని,ఠానూ నాయక్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెట్టాలని, గిరిజన బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, లంబాడి భాషకు గుర్తించి ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని మరో 6 గిరిజన సమస్యలపై తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.

50 మంది తో నూతన రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

రాష్ట్ర అధ్యక్షులుగా - ఎం ధర్మనాయక్

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా - ఆర్ శ్రీరాం నాయక్

కార్యదర్శివర్గం

1)గుగులోత్ భీమా సాహెబ్ - కరీంనగర్

2) అశోక్ - నాగర్ కర్నూల్.

3)మూడ్ రవి నాయక్ - నల్గొండ

4) మాలోత్ కిషన్- మహబూబాబాద్.

5) బాల్య నాయక్ - వనపర్తి.

రాష్ట్ర సహాయ కార్యదర్శిలు

6)భూక్య వీరభద్రం- ఖమ్మం జిల్లా

7) మూడ్ బాలు నాయక్ -హైదరాబాద్ సౌత్

8) వాంకుడోత్ వీరన్న- హనుమకొండ

9) ఎర్ర నాయక్- నల్గొండ

10) అరుణ్ నాయక్- రాష్ట్ర కేంద్రం.

11) మహిళా- కోఆప్షన్

-15 మంది రాష్ట్ర కార్యదర్శి వర్గం, రాష్ట్ర కమిటీ సభ్యులు 35 మంది.మొత్తం.50 మందితో ఎన్నికయింది.

రాష్ట్ర మహాసభలో సంఘీభావంగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడు శోభన్, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటా రమేష్ మహాసభలో స్వభారత సందేశాన్ని ఇచ్చారు.

🏠 Home