🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

సోమవారం, 12 Oct 2026, 7:02 PM

QR Code

కూచిపూడి దేవాలయాల సింహద్వారానికి శంకుస్థాపన...

News Image

కోదాడ, అక్టోబర్ 12 (ఆర్యాద్వి):

కూచిపూడి గ్రామంలోని అంతరగంగా వాగు పక్కన శెట్టి వారి వంశస్థుల స్థలంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న దేవాలయాల ప్రాంగణంలో సింహద్వారానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఆలయ నిర్వాహకులు కందికొండ సాయిబాబు మాట్లాడుతూ లక్షల విలువైన భూమిని దేవాలయాల నిర్మాణానికి విరాళముగా ఇచ్చి ఆలయ నిర్మాణానికి పునాదులు వేసిన శెట్టి వారి వంశస్థులకు ధన్యవాదములు తెలియజేస్తూ గ్రామ పెద్దలు,ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున దేవాలయాల నిర్మాణం జరుగుతుందని వారి అందరి సహకారంతో శెట్టి వారి దైవభూమి నందు భక్తాంజనేయ స్వామి, సీతా రామాంజనేయ స్వామి ఆలయం, శబరిగిరి అయ్యప్ప మందిరం, లక్ష్మీ నరసింహ స్వామి, షిర్డీ సాయి మందిరాలు ప్రతిష్టకు ముస్తాభవుతున్నాయని ఈ మహత్తర కార్యక్రమంలో భక్తులు విరివిగా విరాళాలు అందించి భగవంతుని కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శెట్టి సురేష్ నాయుడు, శెట్టి వెంకట నారాయణ,మందలపు శేషయ్య,శెట్టి నర్సింహా రావు,శెట్టి రమేష్,శెట్టి శ్రీను, గోపి, పసుపులేటి ముత్తయ్య, శిరంశెట్టి చంద్రయ్య, వట్టెం తిరుపతయ్య,మలిశెట్టి మాధవరావు, మలిశెట్టి సాయిబాబు,నాగళ్ల నాగేశ్వరావు,మెట్టు పుల్లయ్య, మెట్టు లక్ష్మి, ముత్యాల పద్మ, గంగిశెట్టి గోపాలరావు, శెట్టి వీరయ్య,మార్నేల వెంకన్న,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

🏠 Home