🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

సోమవారం, 12 Oct 2026, 7:05 PM

QR Code

ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రభుత్వంపై అసంతృప్తి వెళ్లగక్కి నిరసన తెలిపే ఏకైక ఆయుధం ఓటుహక్కు

News Image

రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు మూడేళ్ల కాంగ్రెస్ విధ్వంసకర పాలనకు చెంపపెట్టు సమాధానం కావాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక ప్రక్రియ ఓటర్ నమోదు ప్రక్రియ

అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి

_ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్

అనంతగిరి, అక్టోబర్ 12 (ఆర్యాద్వి):

వరంగల్–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రాధాన్యతను వివరించేందుకు కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అనంతగిరి మండలం చనుపల్లి గ్రామంలో అనంతగిరి మండల నాయకులతో కలిసి ఓటరు నమోదు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల నాయకులకు దిశా నిర్దేశం చేస్తూ అర్హులైన ప్రతి పట్టభద్రుని గుర్తించి ఓటరు నమోదు చేయించే బాధ్యతను నాయకులు అందరూ సమన్వయంతో చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హత కలిగిన పట్టభద్రులందరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకునేలా క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని నాయకులకు సూచించారు. ప్రతి గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అర్హులైన పట్టభద్రులను గుర్తించి, వారికి ఓటరు నమోదు ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని నిర్ణయించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని అన్నారు. అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించే విధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించి పట్టభద్రులకు ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని నివృత్తి చేస్తూ, అవసరమైన సమాచారాన్ని అందించాలని సూచించారు. పార్టీ నాయకులు సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని, ప్రతి అర్హుడిని ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. పట్టభద్రుల సమస్యలు, వారి హక్కులు, ప్రజాస్వామ్య ప్రక్రియలో వారి భాగస్వామ్యం వంటి అంశాలపై కూడా విస్తృతంగా అవగాహన కల్పించాలని నాయకులకు సూచించారు.

🏠 Home