🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 12 October 2026, 7:12 pm Posted by : ARYADVI NEWS

సోలార్ విద్యుత్ రాయితీలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.

News Image
పీఎం సూర్య ఘర్ సేవ సేతు అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి.

నరసన్నపేట

సోలార్ విద్యుత్ రాయితీలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నరసన్నపేట నియోజకవర్గం శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు. స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన సేవా సేతు అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్న రాయితీతో కూడిన రూఫ్ టాప్ సోలార్ విద్యుత్తు పవర్ ప్లాంట్లను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. సాంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు సోలార్ ప్యానల్ ఏర్పాటుపై భారీగా రాయితీలు (సబ్సిడీలు) అందిస్తున్నాయనితెలిపారు.గృహవినియోగదారులు, రైతులు, వ్యాపారవేత్తలు, తమ భవనాలు పొలాల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లులో భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు అని పేర్కొన్నారు. సోలార్ విద్యుత్తు వాడకం వల్ల ఇళ్లకు వాణిజ్య సాముదాయాలకు విద్యుత్ ఖర్చులు తగ్గడమే కాకుండా కాలుష్య రహిత పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో తోడ్పడతాయని ఎమ్మెల్యే రమణమూర్తి వివరించారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ యోజన రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అందుబాటులో ఉన్న రాయితీలను వివరాలను విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమములో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మనలు రోనంకి కృష్ణమనాయుడు, దామోదర నరసింహులు, రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ జామి వెంకట్రావు, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు అడపా చంద్రశేఖర్, మిరియాలపళ్లి వెంకటఅప్పలనాయుడు, సారవకోట మండల పార్టీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ, వంశధార డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ సిమ్మ చంద్రశేఖర్, క్లస్టర్ ఇంచార్జి గోద్దు చిట్టిబాబు, సూరపు నారాయణదాసు, పోలాకి పిఎసిఎస్ చైర్మన్ బైరి భాస్కరరావు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బలగ భారతి,యూనిట్ ఇన్చార్జి పిసా కృష్ణ, మాజీ ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబు, కెవిఎల్ ప్రసాద్, తంగి తారకేశ్వరరావు, కొంక్యన బాబ్జి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home