🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

మంగళవారం, 13 Oct 2026, 6:32 PM

QR Code

దుర్గమ్మ పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు

News Image

అనంతగిరి, అక్టోబర్ 13( ఆర్యాద్వి): మండల పరిధిలోని రఘునాధ ఆలయంలో ఏర్పర్చిన దుర్గమ్మ విగ్రహ పూజలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు పాల్గొని

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామ ప్రజల సంక్షేమానికి, వర్షాలకు, పంటలకు అమ్మవారి అనుగ్రహం కలగాలని అన్నారు. గ్రామ దేవతల పూజలు గ్రామంలో ఐక్యతకు, సామాజిక సమగ్రతకు చిహ్నమని అన్నారు. అమ్మవారి కృపతో గ్రామంలో శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం నెలకొనాలని కోరారు. సంప్రదాయ పండుగలను తరతరాలుగా కొనసాగించడం ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలు నిలిచిపోతాయని పేర్కొన్నారు.

గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని, ప్రజల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని చందర్‌రావు హామీ ఇచ్చారు.అనంతరం

దుర్గమ్మ ఉత్సవాల ఏర్పాట్లలో కృషి చేసిన గ్రామ పెద్దలు, యువకులు, కమిటీ సభ్యులను అభినందించారు.ఈ సందర్భంగా గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవ వాతావరణాన్ని కల్పించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

🏠 Home