🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 13 October 2026, 6:45 pm Posted by : ARYADVI NEWS

ఇంద్రకీలాద్రిపై విజయ్‌ ప్రత్యేక పూజలు.. పూర్ణకుంభంతో స్వాగతం

News Image
విజయవాడ: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

ఆలయానికి చేరుకున్న విజయ్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు వేదమంత్రాల నడుమ ఆలయ మర్యాదలు నిర్వహించారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు సమర్పించారు.

విజయ్‌ రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. ఆయనను చూసేందుకు భక్తులు, సందర్శకులు ఆసక్తి చూపించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి అమ్మవారిని దర్శించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
🏠 Home