🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

గురువారం, 15 Oct 2026, 9:27 AM

QR Code

ఎల్బీనగర్‌లో వైభవంగా అమ్మవారి పూజలు

News Image

* అన్నపూర్ణాదేవిగా దర్శనం.. 108 రకాల నైవేద్యాల సమర్పణ

* ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత

ఖమ్మం ప్రతినిధి : అక్టోబర్, 14:

నగరంలోని 8వ డివిజన్ ఎల్బీనగర్‌లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాల్గో రోజు అమ్మవారు భక్తులకు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి భక్తిప్రపత్తులతో 108 రకాల పిండివంటలు, ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆశీస్సులతో, బీఆర్ఎస్ యువజన విభాగం ఖమ్మం నగర మాజీ అధ్యక్షుడు దేవభక్తిని కిషోర్ బాబు సహకారంతో బిఆర్ఎస్ నాయకుడు వాంకుడోత్ సురేష్ నాయక్ దంపతులు ఈ పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సంక్షేమానికి కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని కొనియాడారు. కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని పేర్కొంటూ, మళ్లీ కేసీఆర్ ప్రజాపాలన రావాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం వారు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.

కార్యక్రమంలో సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పగడాల నాగరాజు, చిరుమామిళ్ల కిరణ్, దండ జ్యోతి రెడ్డి అయ్యప్ప రెడ్డి, వీరేందర్ గౌడ్, మాటేటి కిరణ్ కుమార్, మోరంపూడి సాయి, బొడ్డు వెంకటేశ్వర్లు, రమేష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🏠 Home