పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు: పోలీస్ కమిషనర్
ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 15:
విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండే పోలీస్ సిబ్బంది కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు.
పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో పోలీస్ సిబ్బందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు పోలీస్ హెడ్ క్వాటర్స్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని పోలీస్ కమిషనర్ ప్రారంభించారు.
ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. కంటి చూపు సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, అవసరమైన వైద్య చికిత్స పొందడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు.
ఈ వైద్య శిబిరంలో పోలీస్ సిబ్బందికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించారని, కంటి చూపు సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు తదుపరి చికిత్స పొందాలని సూచించారు.
పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమం కోసం శాఖ తరఫున అవసరమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు రామానుజం, కుమారస్వామి, ఏఆర్ ఏసీపీలు నర్సయ్య, సుశీల్ సింగ్, డాక్టర్ పాశం మహేష్, ఆర్ఐలు కామరాజు, సురేష్, శ్రీశైలం, సాంబశివరావు పాల్గొన్నారు.