🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 16 October 2026, 8:31 am Posted by : ARYADVI NEWS

-ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి

News Image
-ఏఐటియుసి నాయకులు శింగు నర్సింహారావు

ఖమ్మం ప్రతినిధి: అక్టోబర్, 15:

ఖమ్మం : ఎన్హెచ్ఎం ఉద్యోగుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష విడనాడి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటియుసి జాతీయ సమితి సభ్యులు శింగు నర్సింహారావు డిమాండ్ చేశారు. -ఎన్హెచ్ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు పాలకులు తాత్సరం చేస్తున్నారని ప్రధానమైన రంగాలకు సంబంధించిన ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించడం లేదని ఆయన ఆరోపించారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్ వద్ద గల ధర్నాచౌక్లో సమ్మె చేస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మెకు ఏఐటియుసి -పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈసందర్భంగా నర్సింహారావు మాట్లాడుతూ వైద్య రంగంలో కాంట్రాక్ట్, -అవుటసోర్సింగ్ పేరుతో ఉద్యోగులను నియమించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. దేశ వ్యాప్తంగా ఎన్హెచ్ఎంలో 17 లక్షల మంది పని చేస్తుండగా తెలంగాణలో 17వేల మంది దశాబ్ద కాలంగా పనిచేస్తున్నారని శింగు నర్సింహారావు తెలిపారు. వీరి భవిష్యత్తును పాలకులు అంధకారంగా మార్చారని గత్యంతరం లేక శ్రమ దోపిడీకి గురవుతున్నారని వీరికి కనీసం పిఎఫ్, ఈఎస్ఐ తదితర చట్టబద్ధ హక్కులు ఏవి అమలు కావడం లేదని ఆయన తెలిపారు. కనీసం హెల్త్ కార్డులు కూడా లేవని కొన్ని రాష్ట్రాలు వీరిని పర్మినెంట్ చేశారని రాష్ట్రంలో కూడా పర్మినెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులను బెదిరించడం సరికాదన్నారు. మద్దతు తెలియజేసిన వారిలో ఏఐటియుసి జిల్లా గౌరవాధ్యక్షులు గాదె లక్ష్మి నారాయణ పాల్గొన్నారు.
🏠 Home