🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

శుక్రవారం, 16 Oct 2026, 2:10 PM

QR Code

గొడ్రియాల శివారులో 50 మామిడి చెట్ల నరికివేత!

News Image

👉అధికారుల అనుమతులు ఉన్నాయా? యంత్రాలతో చెట్ల తొలగింపుపై అనుమానాలు!

👉నరికివేతపై విచారణ జరిపించాలని స్థానికుల డిమాండ్‌

అనంతగిరి, అక్టోబర్ 16 (ఆర్యాద్వి):

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని గొడ్రియాల గ్రామ శివారులో సుమారు 50 మామిడి చెట్లను నరికివేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన దళారుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో, ఇంత పెద్ద సంఖ్యలో చెట్లను తొలగించడానికి అనుమతులు ఉన్నాయా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

*అధికారులకు తెలిసే జరిగిందా?*

గ్రామ శివారులో పెద్ద సంఖ్యలో మామిడి చెట్లు నరికివేతకు గురవుతున్నా సంబంధిత అధికారులు ముందస్తు సమాచారం తీసుకున్నారా? చెట్ల నరికివేతకు ఎవరు అనుమతులు ఇచ్చారు? ఎన్ని చెట్లకు అనుమతి మంజూరు చేశారు? నిబంధనల ప్రకారమే చెట్లను తొలగించారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

*సంబంధిత శాఖలు స్పందించాలి*

చెట్ల నరికివేతకు సంబంధించిన అనుమతుల వివరాలను అధికారులు పరిశీలించాలని, ఘటనపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చెట్లను నరికివేసినట్లు తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

గొడ్రియాల గ్రామ శివారులో జరిగిన మామిడి చెట్ల నరికివేతపై సంబంధిత అధికారులు స్పందించి, అనుమతుల వివరాలను వెల్లడిస్తారా? బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

🏠 Home