నాపై నిఘా పెట్టారు.. సీఎం సోదరుడిపై ఎంపీ అర్వింద్ సంచలన ఆరోపణలు
నిజామాబాద్: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సోమవారం తెలంగాణ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపై సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి ఆదేశాల మేరకు, ఒక ఏసీపీ స్థాయి అధికారి తన కదలికలపై నిఘా ఉంచినట్లు ఆయన ఆరోపించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను ఉద్దేశించి ఆయన ఒక పోస్ట్ చేశారు."డీజీపీ సీవీ ఆనంద్ గారూ, మీరు నాకు దశాబ్దాలుగా తెలుసు. మిమ్మల్ని ఎప్పుడూ ఒక సమర్థవంతమైన అధికారిగానే పరిగణించాను. అయితే, ముఖ్యమంత్రి సోదరుడి ఆదేశాల మేరకు ఒక ఏసీపీ స్థాయి అధికారికి నా కదలికలను పర్యవేక్షించే బాధ్యతను అప్పగించినట్లు నా దృష్టికి వచ్చింది"...