మిస్ యూనివర్స్ వేదికపై సుస్మితా సేన్‌తో ఊర్వశి రౌతేలా.. భావోద్వేగం

ముంబయి: నటి, మాజీ అందాల రాణి ఊర్వశి రౌతేలా మరోసారి వార్తల్లో నిలిచారు. మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు వరుసగా నాలుగోసారి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఈసారి ఆమెకు ఈ కార్యక్రమం మరింత ప్రత్యేకంగా మారింది. తన గురువుగా భావించే మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో ఒకే వేదికను పంచుకోవడంతో ఊర్వశి భావోద్వేగానికి గురయ్యారు.తన కెరీర్‌లో సుస్మితా సేన్ కీలక పాత్ర పోషించారని ఊర్వశి తెలిపారు. తనకు సుస్మితా తొలి మెంటర్, గురువు అని పేర్కొన్నారు. తన పట్టాభిషేకం రోజున సుస్మితా స్వయంగా కిరీటం అలంకరించిన క్షణాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. సుస్మితా తనపై ఉంచిన నమ్మకం తనకు ఎంతో ప్రత్యేకమని ఊర్వశి పేర్కొన్నారు....