కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై బిగ్ రిలీఫ్.. వారికి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

హైదరాబాద్: తెలంగాణలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాల నిధుల విడుదలపై గతంలో విధించిన మధ్యంతర స్టేను సవరించిన న్యాయస్థానం.. దివ్యాంగ వధువులకు ఆర్థిక సాయం అందించేందుకు అనుమతి ఇచ్చింది.దివ్యాంగ వధువులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద అందించే ఆర్థిక సాయంపై ఉన్న స్టేను హైకోర్టు తాజాగా తొలగించింది. దీంతో దివ్యాంగ లబ్ధిదారులకు నిధుల విడుదల ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. అయితే దివ్యాంగులు మినహా ఇతర సాధారణ వర్గాల లబ్ధిదారులకు మాత్రం నిధుల విడుదలపై ఉన్న స్టే కొనసాగుతుంది అని హైకోర్టు స్పష్టం చేసింది.కాగా, 2014 నుంచి రాష్ట్రంలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్...