జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలి
జర్నలిస్టుల పాదయాత్రకు సీపీఎం సంఘీభావం కారేపల్లి, ఆగస్టు 25: టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ చేపట్టిన వైరా నియోజకవర్గ స్థాయి పాదయాత్ర మంగళవారం కారేపల్లి మండల కేంద్రంలో ప్రారంభమైంది. కారేపల్లి బస్టాండ్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమానికి సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు హాజరై పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులు ప్రధాన భూమిక పోషిస్తున్నారని ఆయన అన్నారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వాలు, పాలకులు మారినా పరిష్కరించడంలో చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో...