గచ్చిబౌలిలో భారీ కూల్చివేతలు.. అక్రమ నిర్మాణాలపై అధికారుల ఉక్కుపాదం

అంజయ్య నగర్‌లో అక్రమ కట్టడాల తొలగింపు రెండు భవనాలను ఇప్పటికే నేలమట్టం చేసిన అధికారులు ఆరంతస్తుల భవనం కూల్చివేతకు శ్రీకారం ఏడంతస్తుల భవనం కూలిన ఘటన తర్వాత కఠిన చర్యలు హైదరాబాద్: గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో అక్రమ, ప్రమాదకర నిర్మాణాలపై అధికారులు చేపట్టిన కూల్చివేతల ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైడ్రా అధికారులు కలిసి భారీ యంత్రాలతో పలు నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఇప్పటికే రెండు భవనాలను పూర్తిగా కూల్చివేసిన అధికారులు.. మరో ఆరంతస్తుల భవనాన్ని కూడా నేలమట్టం చేసే పనులు చేపట్టారు. కూల్చివేతల నేపథ్యంలో పోలీసులు, అధికారులు భారీగా మోహరించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. అంజయ్య నగర్‌లో గత...