రష్యాలో అమెరికా యుద్ధ విమానం.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?

అమెరికా–రష్యా మధ్య ఉద్రిక్తతల వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన సైనిక రవాణా విమానం బోయింగ్ సీ-17 గ్లోబ్‌మాస్టర్-3 రష్యా రాజధాని మాస్కోలో ల్యాండ్ కావడం తీవ్ర చర్చకు దారితీసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో అమెరికా మిలిటరీ విమానం రష్యాలో దిగడంతో.. ఇరు దేశాల మధ్య ఏదైనా కీలక దౌత్య పరిణామం జరగబోతోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విమానం లాత్వియా రాజధాని రిగాలో ఉదయం 8.50 గంటలకు బయలుదేరి.. సుమారు 10 గంటలకు మాస్కోలో దిగినట్లు సమాచారం. అయితే ఈ పరిణామంపై అమెరికా, రష్యా ప్రభుత్వాలు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. తమకు విమానం రాకపై సమాచారం లేదని రష్యా పేర్కొన్నట్లు...