ప్రభుత్వ ఉద్యోగాల్లో 95% స్థానికులకే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం పోస్టులను స్థానిక అభ్యర్థులతోనే భర్తీ చేసేలా చర్యలు చేపట్టినట్లు తెలిపింది. 2025 రాష్ట్రపతి ఉత్తర్వులపై కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోని స్థానిక యువతకు ఎక్కువ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ మార్పులు తీసుకొచ్చింది. దీనివల్ల జిల్లాల వారీగా ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యత పెరగనుంది. నాలుగు జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేసి, అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది.