కోదాడ సమీపంలో ఘోర ప్రమాదం.. కంటైనర్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు.. ఆరుగురు మృతి

ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు 20 మందికి తీవ్ర గాయాలు.. పలువురి పరిస్థితి విషమం హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తుండగా ఘటన సూర్యాపేట: జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం దొరకుంట శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌ నుంచి ఏలూరుకు 42 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. దొరకుంట సమీపంలోకి చేరుకున్న సమయంలో రోడ్డుపై నిలిపి ఉన్న కంటైనర్‌ను బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం...