రక్షాబంధన్‌ ఎప్పుడు జరుపుకోవాలి? సోదరుడికి రాఖీ కట్టేందుకు ఇదే శుభ సమయం

సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందిగ్ధతకు పండితులు స్పష్టత ఇచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 28, శుక్రవారం రక్షాబంధన్‌ జరుపుకోవాలని సూచించారు. రాఖీ కట్టేందుకు ఉదయం వేళ శుభప్రదమైన సమయమని తెలిపారు. హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27 గురువారం ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 9:48 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయ సమయంలో ఉన్న తిథిని ప్రామాణికంగా తీసుకోవడం వల్ల ఆగస్టు 28న పౌర్ణమిగా పరిగణిస్తున్నట్లు పండితులు తెలిపారు. మరోవైపు ఆగస్టు 27న ఎక్కువ సమయం భద్ర కాలం ఉండటంతో ఆ రోజున రాఖీ కట్టడం శ్రేయస్కరం కాదని...