సౌత్‌ ఇండియన్స్‌ టార్గెట్‌గా సైబర్ మోసాలు.. స్థానిక భాషల్లో ఫోన్‌ కాల్స్‌

హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లు దక్షిణాది రాష్ట్రాల ప్రజలను మోసం చేసేందుకు కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మాట్లాడే టెలీకాలర్లను నియమించుకుని స్థానిక భాషల్లో ఫోన్లు చేయిస్తున్నారు. దీంతో బాధితులు సులభంగా నమ్మేలా చేసి బ్యాంకింగ్‌ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు. ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న మూడు నకిలీ కాల్‌ సెంటర్లపై ఇటీవల టీజీసీఎస్‌బీ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా తెలుగు మాట్లాడే 21 మంది మహిళా టెలీకాలర్లను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో నమోదైన 22 సైబర్‌ మోసాలతో ఈ నెట్‌వర్క్‌కు సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈజీ మనీ పేరుతో వల ఆన్‌లైన్‌ ఉద్యోగాలు,...