ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత..
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు (73) కన్నుమూశారు. ఆయన మృతిచెందిన విషయాన్ని నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆయన మృతికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సంతాపం తెలిపింది. 1976లో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అంతులేని కథ’ సినిమాతో నారాయణరావు వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అనంతరం 100కు పైగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ముత్యాల పల్లకి’, ‘అంగడి బొమ్మ’, ‘చిలకమ్మ చెప్పింది’, ‘గ్యాంగ్ లీడర్’, ‘హిట్లర్’ తదితర చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. నటుడిగానే కాకుండా ‘దేవాంతకుడు’,...