వాషింగ్ మెషీన్ పేలుడు: హైదరాబాద్‌లో తృటిలో తప్పిన ప్రాణాపాయం

హైదరాబాద్:నగరంలోని పుప్పాలగూడ తిరుమల హిల్స్ రోడ్ నంబర్ 11లోని ఒక నివాస గృహంలో భారీ ప్రమాదం సంభవించింది. ఇంట్లోని వాషింగ్ మెషీన్ ఒక్కసారిగా టపాసుల వలె పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.ఈ హఠాత్ పరిణామానికి తీవ్ర భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అయితే ఫైర్ ఇంజన్ ఘటనా స్థలానికి చేరుకోవడానికి దాదాపు గంట సమయం పట్టిందని, ఈ ఆలస్యం కారణంగానే ఇంట్లోని ఆస్తి నష్టం మరింత ఎక్కువగా జరిగిందని బాధితులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న వారెవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా బయటపడ్డారని తెలుస్తోంది. కాగా, వాషింగ్ మెషీన్...