రాయదుర్గం భూమికి మైండ్‌బ్లోయింగ్‌ ధర.. ఎకరం రూ.269 కోట్లు!

హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో భూముల ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. రాయదుర్గంలో ఎకరం భూమి ఏకంగా రూ.269 కోట్లకు అమ్ముడైంది. వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఎకరం రూ.264 కోట్ల ధర పలకగా.. తాజాగా అంతకంటే ఎక్కువ ధర నమోదైంది. రాయదుర్గం సర్వే నంబర్‌ 83/1లోని 5.38 ఎకరాల భూమిని టీజీఐఐసీ ఆన్‌లైన్‌ వేలం ద్వారా విక్రయించింది. ఎకరానికి కనీస ధరను రూ.175 కోట్లుగా నిర్ణయించగా.. పలు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు వేలంలో ఉత్సాహంగా పాల్గొన్నాయి. చివరకు వంశీరాం బిల్డర్స్‌ ఎకరానికి రూ.269 కోట్ల చొప్పున మొత్తం 5.38 ఎకరాలను దక్కించుకుంది. దీంతో ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.1,447...