నూతనకల్‌లో సభాస్థల పరిశీలనకు ఎమ్మెల్యే మందుల సామేల్

నూతనకల్: సీలింగ్‌ భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం నేపథ్యంలో నూతనకల్‌ మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో సభాస్థలాన్ని పరిశీలించేందుకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నూతనకల్‌కు రానున్నారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరుకానున్నారు. సభాస్థల పరిశీలనకు మండల కాంగ్రెస్‌ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్‌, యువజన కాంగ్రెస్‌ నాయకులు, సోషల్‌ మీడియా కోఆర్డినేటర్లు, ఎన్‌ఎస్‌యూఐ అనుబంధ విభాగాల సభ్యులు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నూతనకల్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కట్ట మల్లారెడ్డి కోరారు. సభాస్థల...