70 ఏళ్ల రైతుల భూసమస్యకు కాంగ్రెస్ ప్రభుత్వంతో పరిష్కారం: ఎమ్మెల్యే మందుల సామేల్
నూతనకల్: నూతనకల్ మండల కేంద్రంలోని స్టేడియం సభాస్థలంలో శనివారం (29-08-2026) నిర్వహించనున్న సీలింగ్ భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ కోరారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి చేతుల మీదుగా రైతులకు పట్టాల పంపిణీ జరగనుంది. తొమ్మిది మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో కలిసి నిర్వహించిన ప్రెస్మీట్లో ఎమ్మెల్యే సామేల్ మాట్లాడారు. గత 70 ఏళ్లుగా ఎర్రపహాడ్ దొరల భూములు విక్రయించినప్పటికీ రైతులకు పట్టాలు, పాస్బుక్లు అందక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు రైతుల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం...