లండన్ వరకు లుక్కా హిమజ ప్రతిభ.. బ్రిటన్ మహారాణి నిర్వహించే రచనా పోటీకి న్యాయనిర్ణేతగా అరుదైన గుర్తింపు

అంతర్జాతీయ రచనా పోటీలో జడ్జిగా తెలంగాణ యువ న్యాయవాది లుక్కా హిమజ... రాయల్ కామన్వెల్త్ సొసైటీ నుంచి ‘వాల్యూడ్ జడ్జ్’ సర్టిఫికెట్. తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా నమోదై, ప్రస్తుతం హైకోర్టు ప్రముఖ మహిళా న్యాయమూర్తి ఆధ్వర్యంలో లీగల్ రీసెర్చర్‌గా సేవలందిస్తున్న లుక్కా హిమజ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు పొందారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన అంతర్జాతీయ రచనా పోటీలలో ఒకటైన ది క్వీన్స్ కామన్వెల్త్ రైటింగ్ కాంపిటీషన్ 2026 కి న్యాయనిర్ణేతగా వ్యవహరించినందుకు రాయల్ కామన్వెల్త్ సొసైటీ ఆమెకు ‘వాల్యూడ్ జడ్జ్’ సర్టిఫికెట్ అందజేసింది. 1883లో ప్రారంభమైన ఈ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ రచనా పోటీకి ప్రపంచవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు ఉంది. పోటీ విజేతల కోసం నిర్వహించే...