రాఖీ పండుగ రోజే విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

విశాఖపట్నం: రాఖీ పండుగ రోజే విశాఖపట్నం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. పెందుర్తి మండలం చింతలగ్రహారం కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మల్లా వినోద్‌కుమార్‌ తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లో వినోద్‌కుమార్‌ ఉరికి వేలాడుతూ కనిపించగా, ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు మృతిచెంది ఉన్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. వినోద్‌కుమార్‌ ముందుగా భార్య, పిల్లలకు విషమిచ్చి, అనంతరం తాను ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. రాఖీ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు సంతోషంగా గడిపిన కొద్ది...