రేపే నీట్ పీజీ పరీక్ష.. దేశవ్యాప్తంగా పకడ్బందీ ఏర్పాట్లు
2.73 లక్షల మంది అభ్యర్థులు.. 340 నగరాల్లో 1,300 పరీక్షా కేంద్రాలు దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పీజీ సీట్ల భర్తీ కోసం నిర్వహించే NEET PG 2026 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 30న దేశంలోని 340 నగరాల్లో 1,300 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈసారి 2.73 లక్షల మందికి పైగా వైద్య గ్రాడ్యుయేట్లు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ పరీక్ష ద్వారా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో...