ఏఐ సాయంతో అరుదైన బ్రెయిన్ సర్జరీ.. విజయవంతంగా కోలుకున్న 48 ఏళ్ల వ్యక్తి
యూకే: వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం రోజురోజుకూ విస్తరిస్తోంది. వ్యాధుల గుర్తింపు, స్కానింగ్ రిపోర్టుల విశ్లేషణ, మందుల మోతాదును నిర్ణయించడం వంటి అనేక అంశాల్లో ఏఐ కీలకంగా మారుతోంది. తాజాగా ఏఐ సాయంతో ఓ అరుదైన మెదడు శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. యూకేకు చెందిన 48 ఏళ్ల రిస్ హిబ్బర్ట్ ఓ రోజు నడుచుకుంటూ వెళ్తుండగా హఠాత్తుగా స్పృహ కోల్పోయారు. అనంతరం ఆయనకు మూర్ఛ వచ్చింది. వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. పిట్యుటరీ గ్రంథి సమీపంలో 11 మి.మీ. పరిమాణంలో కణితి ఉన్నట్లు గుర్తించారు. ఆ కణితి క్యాన్సర్ కాదని తేలినప్పటికీ.. అది చూపుపై ప్రభావం చూపుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దాన్ని తొలగించకపోతే...